Share News

చికిత్స పొందుతూ ఒకరి మృతి

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:49 AM

అమటాం రాయవలస సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు.

 చికిత్స పొందుతూ ఒకరి మృతి

భోగాపురం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): అమటాం రాయవలస సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై సీఐ కె.దుర్గాప్రసాదురావు శుక్రవారం తెలిపి న వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌ రాష్ట్రం, రీతాస్‌ జిల్లా, సంజాలీ మండలానికి చెందిన మొసాన రవీంద్ర సింగ్‌(30) పూసపాటిరేగ సమీపంలో ప్లేవుడ్‌ ఫ్యాక్టరీ లో కూలీగా పని చేస్తున్నాడు. ఈనెల 8వ తేదీ రాత్రి సొంత పనుల నిమిత్తం స్నేహితుడు అమిత్‌తో కలిసి ద్విచక్రవాహనంపై తగరపువలస వెళ్తున్నారు. అమటాం రాయవలస ట్రంపెట్‌ సమీప జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ రోడ్డు పై తుల్లిపడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని తగరపువలస ప్రైవేటు ఆసుప త్రికి తరలించారు. రవీంద్ర సింగ్‌ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలిం చారు. అక్కడ చికిత్స పొందుతూ రవీంద్రసింగ్‌ మృతిచెందాడు. మృతుడి భార్య శీలాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 12:49 AM