Share News

చికిత్స పొందుతూ ఒకరి మృతి

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:59 PM

మండలంలోని గుచ్చిమి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అదే గ్రామానికి చెందిన జి.మహేష్‌ (30) చికిత్స పొందుతూ మృతిచెందాడు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

సీతానగరం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుచ్చిమి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అదే గ్రామానికి చెందిన జి.మహేష్‌ (30) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ హేమలత కథనం మేరకు.. మండలంలోని గుచ్చిమి సమీపంలో ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి ముం దు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న జి.మహేష్‌ ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన్ను పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ మహేష్‌ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు.

Updated Date - Feb 07 , 2026 | 11:59 PM