చికిత్స పొందుతూ ఒకరు రాత్రి
ABN , Publish Date - May 25 , 2026 | 12:14 AM
మండలంలోని మెట్టవలసలో శనివారం రాత్రి ఎలక్ట్రీషియన్ టి.రామకృష్ణ (24) విద్యుదాఘాతం వల్ల గాయపడడం తో చికిత్సపొందు తూ మృతిచెందాడని సీఐ నారాయణరావు తెలిపారు.
బొబ్బిలి రూరల్, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని మెట్టవలసలో శనివారం రాత్రి ఎలక్ట్రీషియన్ టి.రామకృష్ణ (24) విద్యుదాఘాతం వల్ల గాయపడడం తో చికిత్సపొందు తూ మృతిచెందాడని సీఐ నారాయణరావు తెలిపారు. సీఐ కథనం మేరకు... రామకృష్ణ తమ ఇంట్లో కరెంటు లేదని స్విచ్ బోర్డును మరమ్మతులు చేయడానికి ఇప్పి చూస్తుండ గా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ రామకృష్ణ మృతిచెందాడు. రామకృష్ణ తండ్రి లక్ష్మణ గ్రోత్ సెంటర్‌లో కళాసీగా, తల్లి సూరమ్మ పొలం పనులు చేస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గ్రామం లో విషాదఛాయలు అలముకొన్నాయి.