‘విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి’
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:14 AM
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు.
రాజాం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల ఎంపీటీసీ అభ్యర్థులకు ఆయన బీఫాంలు అందజేశారు. టీడీపీ నాయకులు గురవాన నారాయణరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పలపూడి శ్రీనివాసరావు, జడ్డు విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఏకగ్రీవ అభ్యర్థులకు అభినందన
రాజాం నియోజకవర్గంలో ఏకగ్రీవమైన అభ్యర్థులను ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ మంగళవారం శ్యాంపురంలోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించా రు. రాజియ్యపేట, శ్యాంపురం, దేవుదల, కొమిరి, రేగిడి, పుర్లి, వంగర, వాల్తేరు ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.