Share News

ఎన్నికల ప్రక్రియలో బాధ్యతగా పనిచేయాలి

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:41 AM

నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రి యలో బాధ్యతగా పనిచేయాలని నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ బాలాస్వామి సూచిం చారు.

 ఎన్నికల ప్రక్రియలో బాధ్యతగా పనిచేయాలి

  • విజయనగరం నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ బాలాస్వామి

విజయనగరం టౌన్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రి యలో బాధ్యతగా పనిచేయాలని నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ బాలాస్వామి సూచిం చారు. గురువారం స్థానిక నగర కార్పొరేషన్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, అందరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవా లన్నారు. నామినేషన్ల స్వీకరణకు 16 కౌంటర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Updated Date - Oct 16 , 2026 | 12:41 AM