Share News

One must achieve goals with concentration. ఏకాగ్రతతో లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:12 AM

One must achieve goals with concentration. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే తప్పకుండా లక్ష్యాలను సాధిస్తారని హోం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత సూచించారు. సోమవారం విజయనగరంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన షైనింగ్‌ స్టార్స్‌కు బహుమతి, ప్రోత్సాహక, ప్రశంసా పత్రాలను ఆమె పంపిణీ చేశారు.

One must achieve goals with concentration.   ఏకాగ్రతతో లక్ష్యాలను సాధించాలి
ప్రశంసాపత్రం, పారితోషికం అందజేస్తున్న హోంమంత్రి అనిత

ఏకాగ్రతతో లక్ష్యాలను సాధించాలి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత

షైనింగ్‌ స్టార్స్‌కు ప్రశంస, నగదు పారితోషికం అందజేత

విజయనగరం, జూలై 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే తప్పకుండా లక్ష్యాలను సాధిస్తారని హోం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత సూచించారు. సోమవారం విజయనగరంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన షైనింగ్‌ స్టార్స్‌కు బహుమతి, ప్రోత్సాహక, ప్రశంసా పత్రాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల విద్యను అభ్యసించి కళాశాల విద్యకు వెళ్లే ప్రతి విద్యార్థి సరైన ప్రణాళిక వేసుకోవాలని, కీలక సమయంలో మంచి మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. అందుకు క్రమబద్ధమైన ప్రణాళిక కూడా అవసరమని చెప్పారు. ఏ సమయంలో కూడా ఇతరుతో పోల్చుకుని నిరాశ పడేకంటే తమపై తాము నమ్మకం పెంచుకుని తల్లిదండ్రులు, గురువులు, మేధావుల సూచనలను పాటించాలన్నారు. జిల్లాలో గత ఏడాది 150మంది షైనింగ్‌ అవార్డులు అందుకోగా ఈ ఏడాది 184కు చేరటం విద్యలో ప్రభుత్వ ప్రోత్సాహకానికి నిదర్శనమన్నారు. విద్యాశాఖ పరంగా మంత్రి నారా లోకేష్‌ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కలెక్టర్‌ ఎస్‌.రామసుందర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ అభినందనీయమన్నారు. డ్రీమ్‌వాల్‌పై విద్యార్థులు భవిష్యత్‌ లక్ష్యాలను రాసుకోవాలన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే సరైన లక్ష్యాలు అవసరమని, అందుకు ముందే ప్రణాళిక రచించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అదితిగజపతిరాజు, నాగమాధవి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, జనసేన నాయకురాలు యశస్విని, డీఈవో మాణిక్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:12 AM