రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:54 AM
ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలు, ఆశయాలు, సూత్రాలకు కట్టుబడి ఉండాలని జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి అన్నారు.
- జిల్లా న్యాయాధికారి మాధురి
బెలగాం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలు, ఆశయాలు, సూత్రాలకు కట్టుబడి ఉండాలని జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి అన్నారు. పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో గురువారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులతో కలిసి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం దేశ ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించే మహత్తర పత్రమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి పౌరుడు తన బాధ్యతలను నిర్వర్తిస్తూ రాజ్యాంగాన్ని గౌరవించాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.