మనోవర్తి చెల్లించనందుకు నెల రోజుల జైలు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:19 AM
కోర్టు ఆదేశాల ప్రకారం భార్యకు చెల్లించాల్సిన మనోవర్తి సొమ్మును చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న భర్తకు కొత్తవలస న్యాయాధికారి డా.సముద్రాల విజయ్‌చందర్ నెల రోజులు జైలు శిక్ష విధించారు.
కొత్తవలస, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కోర్టు ఆదేశాల ప్రకారం భార్యకు చెల్లించాల్సిన మనోవర్తి సొమ్మును చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న భర్తకు కొత్తవలస న్యాయాధికారి డా.సముద్రాల విజయ్‌చందర్ నెల రోజులు జైలు శిక్ష విధించారు. వివరాలిలా ఉన్నాయి. తుమ్మికాపల్లి పంచాయతీ వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న కోలా అప్పలనాయుడు, కోలా భవానీ అనే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. భవానీ తన భర్త నుంచి మనోవర్తి పొందేందుకు కొత్తవలస కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు భరణం కూడా మంజూరు చేసింది. కోర్టు మంజూరు చేసిన భరణాన్ని చెల్లించకుండా అప్పలనాయుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో కోర్టు అప్పలనాయుడుకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈమేరకు అప్పలనాయుడును పోలీసులు అరెస్టు చేసి, శుక్రవారం రాత్రి న్యాయాధికారి ముందు హాజరు పర్చారు. దీంతో న్యాయాధికారి నెల రోజులు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ మేరకు కోలా అప్పలనాయుడును విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.