Share News

Brake Failure! ఒకటి అదుపుతప్పి.. మరొకటి బ్రేక్‌ ఫెయిలై!

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:24 AM

One Loses Control, Another Suffers Brake Failure! పి.కోనవలస చెక్‌పోస్టు ఒకటో మైలురాయి ఘాట్‌రోడ్డులో మంగళవారం రెండు ప్రమాదాలు సంభవించాయి. కంటైనర్‌ లారీ కొండను ఢీకొట్టడంతో ఒక డ్రైవర్‌ మృతి చెందాడు. బస్సును లారీని ఢీ కొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.

 Brake Failure! ఒకటి అదుపుతప్పి.. మరొకటి బ్రేక్‌ ఫెయిలై!
కొండను ఢీకొన్న కంటైనర్‌ లారీ

  • కొండను ఢీకొన్న కంటైనర్‌.. లారీ డ్రైవర్‌ మృతి

  • బస్సును ఢీ కొట్టిన లారీ.. ఇద్దరికి గాయాలు

పాచిపెంట రూరల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పి.కోనవలస చెక్‌పోస్టు ఒకటో మైలురాయి ఘాట్‌రోడ్డులో మంగళవారం రెండు ప్రమాదాలు సంభవించాయి. కంటైనర్‌ లారీ కొండను ఢీకొట్టడంతో ఒక డ్రైవర్‌ మృతి చెందాడు. బస్సును లారీని ఢీ కొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎస్‌ఐ ఎల్‌.అర్జున్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్‌ తెల్లవారుజామున అదుపు తప్పి పాచిపెంట మండలం పరిధిలోని ఘాట్‌రోడ్డులో కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్‌ మనీష్‌కుమార్‌ (45) డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కంటైనర్‌ లారీలో చిక్కుకున్న డ్రైవర్‌ మృతదేహాన్ని బయటకు తీస్తున్న తరుణంలో వెనుక వైపు ఉన్న నవరంగపూర్‌ నుంచి విశాఖపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సును మరో లారీ బ్రేక్‌ ఫెయిల్‌ అయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనుక సీట్లలో కూర్చున్న పాచిపెంట మండలం కొటికిపెంట గ్రామానికిచెందిన వంతల మాధవి, శ్రీకాకుళం జిల్లా పోలేరు గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ లింగ స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో సాలూరు ఆసుపత్రికి తరలించారు. జరిగిన రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Nov 18 , 2026 | 12:24 AM