గుర్తుతెలియని లారీ ఢీకొని ఒకరు మృతి
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:33 AM
పట్టణ సమీపం బైపాస్ రోడ్డులో సోమవారం గుర్తుతెలియని లారీ పట్టణంలోని బంగార మ్మ కాలనీకి చెందిన పాలవలస సూర్యనారాయణ (50)ను బలంగా ఢీకొట్టింది.
సాలూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపం బైపాస్ రోడ్డులో సోమవారం గుర్తుతెలియని లారీ పట్టణంలోని బంగార మ్మ కాలనీకి చెందిన పాలవలస సూర్యనారాయణ (50)ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందా డు. విషయం గమనించిన స్థానికులు లారీ నిలుపుదల చేయా లని యత్నించి విఫలమయ్యారు. దాంతో డయల్ 100కు సమాచారం అందించారు. అప్పటికే పట్టణంలో మొబైల్ వెహిక ల్‌లో విధులు నిర్వహిస్తున్న సాలూరు రూరల్ ఎస్‌ఐ రవీంద్ర రాజు తన వాహనంపై వెళ్లి లారీ, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి చెందిన మహామ్మద్ కైఫ్‌గా గుర్తించారు. లారీ ఒడిశా నుంచి విశాఖ వెళ్తున్నట్టు గుర్తించారు. సాలూరు ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య రమణమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.