రైలు ఢీకొని ఒకరు మృతి
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:08 AM
రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.
బొండపల్లి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మరువాడ గ్రామానికి చెందిన భీమవరపు శ్రీనివాసరావు(54) అనే వ్యక్తి ఆది వారం ఉదయం బొండపల్లి గ్రామం వెళ్లాడు. తిరిగి వచ్చేక్రమంలో కనిమెరక గ్రా మం వద్ద రైలు పట్టాలు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో శరీరం ముక్కముక్కలై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వరరావు పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు, పెళ్లిళ్లు అయిన కూతురు సంధ్య, కుమారుడు ప్రదీప్‌లు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా కమ్యూనిటీ ఆసుపత్రికి తరలిం చారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.