Share News

టిప్పర్‌ లారీ ఢీకొని ఒకరి మృతి

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:18 AM

ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.

టిప్పర్‌ లారీ ఢీకొని ఒకరి మృతి

అక్కిరెడ్డిపాలెం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన షీలానగర్‌- డాక్‌యార్డు రహదారిలో గురువారం ఉదయం జరిగింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన గొట్టపు సీతంనాయుడు (49) విద్యుత్‌ పనులు చేస్తూ కొన్నేళ్లుగా మల్కాపురం సమీపంలోని జనతాకాలనీలో జీవిస్తున్నాడు. విద్యుత్‌ పరికరాలు కొనుగోలు చేసేందుకు గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై నగరంలోకి బయలుదేరాడు. షీలానగర్‌-డాక్‌యార్డు రహదారిలో టోల్‌గేటు దాటి కొద్దిదూరం వెళ్లిన తరువాత అదేదిశలో వెళ్తున్న టిప్పర్‌ లారీ సీతంనాయుడు దిచక్రవాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీతం నాయుడు రహదారిపై పడిపోగా, లారీ టైర్లు అతడి పైనుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సీతం నాయుడు మృతిచెందాడన్న సమాచారంతో భార్య సత్యవతి, కుమారులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:18 AM