Share News

లారీ ఢీకొని ఒకరి మృతి

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:22 AM

లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.

లారీ ఢీకొని ఒకరి మృతి

ఆరిలోవ (విశాఖపట్నం), ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖ వ్యాలీ పాఠశాల సమీపంలో మంగళవారం జరిగింది. ద్వారకా ట్రాఫిక్‌ సీఐ రవి తెలిపిన వివరాలివి... విజయనగరం జిల్లా గుర్ల మండలం కలచర్ల గ్రామానికి చెందిన సూర్యనారాయణ (50) ప్రతి రోజూ విశాఖ నగరంలోని ఫిషింగ్‌ హార్బర్‌కు వచ్చి చేపలు కొనుగోలు చేసి, తన గ్రామానికి తీసుకువెళ్లి అమ్ముతుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై నగరానికి వస్తుండగా విశాఖ వ్యాలీ సమీపంలో టిప్పర్‌ లారీ ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన సూర్యనారాయణ మీదుగా లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి ఆరిలోవ సీఐ శ్రీనివాస్‌ కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:23 AM