టీడీపీలో వంద కుటుంబాల చేరిక
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:30 AM
పాచి పెంట మండలం రాయగుడివలస పంచాయతీ పరిధిలోని వంద గిరిజన కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి.
సాలూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పాచి పెంట మండలం రాయగుడివలస పంచాయతీ పరిధిలోని వంద గిరిజన కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. సాలూరులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆమె ఆహ్వానించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించేందుకు కట్టుబడి ఉంద న్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, యువత భవిష్యత్ బాగుండేలా నిర్ణయాలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు గట్టి నమ్మకంతో టీడీపీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.