Share News

వందరోజులు పని కల్పించాల్సిందే

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:18 AM

ఉపాధి హామీ పథకం కింద వేతన దారులకు 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశిం చారు.

 వందరోజులు పని కల్పించాల్సిందే

- కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, జనవరి 23 (ఆం ధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కింద వేతన దారులకు 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశిం చారు. ఉపాధి హామీ పనులపై కుటుంబ సర్వే, అక్షర ఆంధ్ర తదితర కార్యక్రమాలపై మండ లాల వారిగా అధికారులతో కలెక్టర్‌ శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశించిన లక్ష్యా లను చేరుకోవాలని సూచించారు. ప్రతి వారం సమీక్షిస్తున్నా కొన్ని మండలాల్లో పురోగతి లేదన్నారు. గృహ సర్వే ఫిబ్రవరి 10 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టిందని, గడువు లోపలే శత శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకూ 39 శాతం పూర్త యిందని తెలిపారు. అక్షరాంధ్ర కార్యక్రమం కింద జిల్లాలో 1.10లక్షల మంది నిరక్ష రాస్యు లను గుర్తించామని, వారందరినీ వలంటీర్లతో మ్యాప్‌ చేసి అక్షరాస్యులనుగా దిద్దే కార్యక్రమం వెంటనే జరగాలన్నారు. మార్చిలో నిర్వహించే ప్రత్యేక పరీక్షకు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ శారదాదేవి, జడ్పీ సీఈవో సత్యనారాయణ పాల్గొన్నారు.

పరిశ్రమలకు అనుమతులన్నీ ఇవ్వాలి

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే అనుమతులన్నీ గడువు లోపలే ఇవ్వాలని కలె క్టర్‌ ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమయ్యే భూములను ఇవ్వడానికి ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు సానుకూలంగా ఉండాలని తెలిపా రు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలెక్టర్‌ ముఖాముఖి మాట్లాడి.. వారికి జిల్లా యంత్రాం గం నుంచి ఎలాంటి సహకారం అవసరమో తెలుసుకున్నారు. ఎప్పటి లోగా పరిశ్రమలు స్థాపించగలరు, సమస్యలు

ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అనుమతులన్నీ గడువులోగా ఇస్తామని , భూ సమస్యలు కూడా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతుల కోసం గతేడాది డిసెంబరు 26 నుంచి ఈ నెల 20 వరకూ పరిశ్రమల స్థాపనకు 649 దరఖాస్తులు అందగా, 618 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. అదే విధంగా పీజీఈజీపీ కింద 2025 -26 సంవత్సరాకి 422 దరఖాస్తులు అందాయన్నారు. బ్యాంకులు 327 దరఖాస్తులను పంపామని, మొత్తం 228 దరఖాస్తుల గ్రౌడింగ్‌ పూర్తయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్‌ కరుణాకర్‌, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్‌ జయచంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:18 AM