Share News

హత్యా నేరం కేసులో ఒకరికి మూడేళ్ల జైలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:08 AM

జిల్లాలోని పూసపాటిరేగ పోలీసు స్టేషన్‌లో 2021లో నమోదైన వరకట్న వేధింపులు, హత్యానేరం కేసులో నిందితుడు మడపాన సుధీర్‌కు మూడేళ్లు జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరి మానా విధిస్తూ విజయనగరం ఐదవ అడిషనల్‌ డిస్ట్రిట్‌ సెషన్స్‌ న్యాయాధికారి ఎన్‌.పద్మావతి సోమవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు.

హత్యా నేరం కేసులో ఒకరికి మూడేళ్ల జైలు

విజయనగరం క్రైం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పూసపాటిరేగ పోలీసు స్టేషన్‌లో 2021లో నమోదైన వరకట్న వేధింపులు, హత్యానేరం కేసులో నిందితుడు మడపాన సుధీర్‌కు మూడేళ్లు జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరి మానా విధిస్తూ విజయనగరం ఐదవ అడిషనల్‌ డిస్ట్రిట్‌ సెషన్స్‌ న్యాయాధికారి ఎన్‌.పద్మావతి సోమవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు. నిందితుడు సుధీర్‌ తన తల్లిదండ్రులతో కలిసి శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామంలో నివాసం ఉండేవారు. సుధీర్‌కు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ఎగటిపే ట గ్రామానికి చెందిన సోనియాతో 2021 మే నెలలో వివాహం జరిగింది. అనం తరం వీరు సాలిపేట వీధి పూసపాటిరేగలో నివాసం ఉండేవారు. కొన్నాళ్ల తర్వా త సుధీర్‌ అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం ఆమెను శారీరకంగా, మా నసికంగా వేధింపులకు గురి చేసేవారు. తన భర్త అత్తమామల వేధింపులు తట్టుకోలేక మనస్థాపం చెందిన సోనియా 2021 డిసెంబరు 15న పూసపాటి రేగలో నివాసం ఉంటున్న ఇంట్లో ఊరివేసుకుని చనిపోయింది. ఈ విషయంపై ఆమె తల్లి పైడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ ఆర్‌.జయంతి వరక ట్న వేధింపులు, హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అప్పటి మహిళా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ టి.త్రినాథరావు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. విచారణలో సుదీర్‌పై నేరారోపణ రుజువు కావడంతో తీర్పు వెల్లడించారు. ఈ కేసులో క్రియా శీలకంగా పనిచేసిన మహిళా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, ఏఎస్‌ఐ మల్లేశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు, పీపీ వై.రేవతిలను ఎస్పీ దామోదర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Jan 20 , 2026 | 12:08 AM