పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల జైలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:53 PM
విజయనగరం రెల్లివీధికి చెందిన పి.ప్రేమ్‌కుమార్ అనే యువకుడికి పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.
విజయనగరం క్రైం మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విజయనగరం రెల్లివీధికి చెందిన పి.ప్రేమ్‌కుమార్ అనే యువకుడికి పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం ఓ ప్రకట నలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెల్లివీధికి చెందిన ప్రేమ్‌కుమార్ అనే యువకుడు కొన్నేళ్ల కిందట ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని పలు రకాలుగా వేధించాడు. దీంతో పెద్దలు అప్పట్లో బాలికను ప్రేమ్‌కుమార్‌కు ఇచ్చి చర్చిలో పెళ్లి చేశారు. అయితే పెళ్లి అనంతరం ప్రేమ్‌కుమార్ అన్నదమ్ములు బాలికను అసభ్యకరంగా తాకటం, స్నానం చేస్తుండగా తొంగిచూడటం వంటి పనులు చేసేవారు. కొన్నాళ్లకు ఆ బాలిక గర్భం దాల్చింది. అలాగే అత్త మామల తో పాటు ప్రేమ్‌కుమార్ సోదరులు, కుటుంబ సభ్యులు అదనపు కట్నం తెమ్మ నటమే కాకుండా శారీరకంగా, మానసికంగా హింసించటంతో బాలిక.. మహిళా పోలీస్‌స్టేషన్‌లో 2025 జనవరిలో ఫిర్యాదు చేసింది. వాదోపవాదాల అనంతరం న్యాయాధికారి కె.నాగమణి సోమవారం నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు. నిందితులుగా చేర్చిన ఆరుగురికి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.5వేలు జరిమా నా విధించారు. బాధితురాలికి పరిహారంగా రూ.5లక్షలు మంజూరు చేసినట్టు తీర్పు వెలువరించారు.