చికిత్స పొందుతూ ఒకరి మృతి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:14 AM
తోటపల్లి గ్రామానికి చెందిన మార్కొండ ఆనందరావు (46) బుధవారం మృతి చెందాడు.
గరుగుబిల్లి, జనవరి7 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి గ్రామానికి చెందిన మార్కొండ ఆనందరావు (46) బుధవారం మృతి చెందాడు. ఈ నెల 5న సుంకి సమీపంలో ని ఐటీడీఏ పార్కు ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. ఉల్లిభద్ర నుంచి తోటపల్లికి ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న ఆనందరావు వాహనానికి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయ్యింది. అలాగే ఆయన కాలు నుజ్జవ్వడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన ఆనందరావును 108 వాహనంలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం పార్వతీపురం కేంద్రాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఈ ఘటపైపై ఎస్‌ఐ ఫకృద్ధీన్ కేసు నమోదుచేశారు.