Share News

రెండు లారీ ఢీకొని ఒకరి మృతి

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:43 AM

రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటన గురువా రం తెల్లవారుజామున చోటుచేసు కుంది.

 రెండు లారీ ఢీకొని ఒకరి మృతి

దత్తిరాజేరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటన గురువా రం తెల్లవారుజామున చోటుచేసు కుంది. పెదమానాపురం పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెదమానాపురం పోలీసుస్టేషన్‌ సమీపాన రెండు లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ సంఘటనలో ఒక లారీలోని క్లీనరుగా పనిచేస్తున్న గుర్ల మండలం పెదబంటుప ల్లి గ్రామానికి చెందిన పడాల సత్యం(60) తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే 108లో గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో విజయ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యం మృతిచెందాడు. డ్రైవర్‌ ఎరబోలు తిరుపతికి గాయాలవ్వగా, విజయగనరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సత్యంకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:43 AM