గంజాయి కేసులో ఒకరి అరెస్టు
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:50 PM
గంజాయి అక్రమ రవాణా కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన తాయాసబ్ అనే నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు మంగళ వారం తెలిపారు.
విజయనగరం క్రైం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): గంజాయి అక్రమ రవాణా కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన తాయాసబ్ అనే నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు మంగళ వారం తెలిపారు. తాయాసబ్‌తో పాటు ఐదుగురు వ్యక్తులు ఒడిశా నుంచి వైజా గ్‌కు కారులో గంజాయిని తరలిస్తూ.. పోలీసులను గమనించి, కారును విడిచి పెట్టి పారిపోయారని ఆయన చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని, ఈ మేరకు తాయ్‌సబ్‌ను అరెస్టు చేశామని సీఐ తెలిపారు.