Share News

హత్యాయత్నం కేసులో ఒకరి అరెస్టు

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:13 AM

మండలంలోని గుడివాడ గ్రామానికి చెందిన ఐటీబీపీ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చాట్ల అప్పలరెడ్డిని హత్యాయత్నం కేసులో అరెస్టు చేసినట్టు సీఐ దుర్గాప్రసాదరావు శనివారం తెలి పారు.

హత్యాయత్నం కేసులో ఒకరి అరెస్టు

భోగాపురం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుడివాడ గ్రామానికి చెందిన ఐటీబీపీ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చాట్ల అప్పలరెడ్డిని హత్యాయత్నం కేసులో అరెస్టు చేసినట్టు సీఐ దుర్గాప్రసాదరావు శనివారం తెలి పారు. ఈ కేసుకు సంబంధించి సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ గ్రామానికి చెందిన చాట్ల అప్పలరెడ్డికి, భీమిలి మండలం జీరుపేటకు చెందిన జీరు శ్రవణ్యకు 2019లో వివాహం జరిగింది. మనస్పర్థలు కారణంగా భార్యాభ ర్తలు విడివిడిగా ఉంటున్నారు. అప్పలరెడ్డి ఫోన్‌ ద్వారా భార్య శ్రవణ్యను పదేపదే వేదిస్తున్నాడు. దీంతో అతనిని ప్రశ్నించేందుకు ఈనెల 9వ తేదీ రాత్రి శ్రావణ్య.. తన తండ్రి జీరు శ్రీను, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గుడివాడ గ్రామం వెళ్లారు. అక్కడ ఇరు కుటుంబాల మధ్యం వాగ్వివాదం జరిగింది. ఈక్రమంలో అప్పలరెడ్డి.. తన మామ జీరు శ్రీనుపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడు జీరు శ్రీను ఈనెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్‌ఐ వి.పాపారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో అప్పలరెడ్డిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.

Updated Date - Apr 12 , 2026 | 12:13 AM