Share News

Now Sparkling Like a Mirror! నాడు అధ్వానంగా.. నేడు అద్దంలా!

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:04 AM

Once in Ruins… Now Sparkling Like a Mirror! సీతంపేట ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాల్లో శరవేగంగా బీటీ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో గత వైసీసీ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా దర్శనమిచ్చిన రోడ్లు.. నేడు అద్దంలా మెరుస్తున్నాయి.

 Now Sparkling Like a Mirror! నాడు అధ్వానంగా.. నేడు అద్దంలా!
ప్రస్తుతం అంటికొండ-సామరెల్లి రహదారి ఇలా..

  • హర్షం వ్యక్తంచేస్తున్న గిరిపుత్రులు

సీతంపేట రూరల్‌, ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాల్లో శరవేగంగా బీటీ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో గత వైసీసీ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా దర్శనమిచ్చిన రోడ్లు.. నేడు అద్దంలా మెరుస్తున్నాయి. సీతంపేట మన్యంలో మారుమూల ప్రాంతమైన సామరెల్లి-అంటికొండ గ్రామ రోడ్డుకు ఇటీవల మోక్షం కల్పించారు. నాబార్డు నిధులు రూ1.70కోట్లతో 4.5కిలోమీటర్ల మేర బీటీ రహదారిని నిర్మించారు. గతంలో ఈ రహదారి పూర్తిగా పాడవడంతో చాలా కాలంపాటు ఆ మార్గంలో ఆర్టీసీ బస్సులు నిలిపేశారు. దీంతో పెద్దగూడ, తురాయిమానుగూడ, లంబగూడ, అంటికొండ, అచ్చెబ, గెద్దకోల గ్రామాల గిరిజనులు రవాణా కష్టాలు ఎదుర్కొనేవారు. అయితే కూటమి ప్రభుత్వ చొరవతో బీటీ రహదారి పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తుండడంతో ఆయా ప్రాంత గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:04 AM