Once Again! మరోసారి!
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:36 PM
Once Again! ఉమ్మడి జిల్లా పరిధిలోని 89 ప్రాథమిక వ్యవసాయ పరసతి సంఘాల్లో త్రిమన్ కమిటీ సభ్యులకు మూడోసారి పదవీకాలం పొడిగించారు. ఈ మేరకు 2027, జనవరి వరకు పదవీకాలం పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
గరుగుబిల్లి, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా పరిధిలోని 89 ప్రాథమిక వ్యవసాయ పరసతి సంఘాల్లో త్రిమన్ కమిటీ సభ్యులకు మూడోసారి పదవీకాలం పొడిగించారు. ఈ మేరకు 2027, జనవరి వరకు పదవీకాలం పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పీఏసీఎస్‌లకు సంబంధించి 2013 నుంచి సహకార సంఘ ఎన్నికలు జరగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం వాటికి పర్సన్ ఇన్‌చార్జిలను నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025, జూలైలో చైర్మన్ లేదా చైర్‌పర్సన్ ఇద్దరు సభ్యులతో త్రిమన్ కమిటీని నియమించింది. ఇప్పటివరకు రెండు ధపాలు వారి పదవీ కాలం పెంచింది. అయితే ఈ ఏడాది జూలై 31తో వారికి పదవీ కాలం ముగియడంతో మరోసారి అవకాశం ఇచ్చింది. కాల పరిమితిని పొడిగింపుపై రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఈ నెల 3న ఆదేశాలు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 30 , విజయనగరం జిల్లాలో 59 పీఏసీఎస్‌ల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.