Share News

వివాహ వేడుకకు వెళ్తూ.. మృత్యుఒడికి

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:12 AM

కుటుంబ సభ్యు లతో కలిసి బంధువుల వివాహ వేడుకకు వెళ్తూ ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు.

వివాహ వేడుకకు వెళ్తూ.. మృత్యుఒడికి

  • ట్రాక్టర్‌పై నుంచి జారిపడి యువకుడి మృతి

  • కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఘటన

బొబ్బిలి రూరల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): కుటుంబ సభ్యు లతో కలిసి బంధువుల వివాహ వేడుకకు వెళ్తూ ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. కుటుంబ సభ్యులతో పాటు ఆయన ప్ర యాణిస్తున్న ట్రాక్టర్‌ తొట్టిపై నుంచి జారిపడి తనువు చాలించా డు. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఘటన జరగడంతో వారు గుండె లవిశేలా రోదించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కారాడవ లస గ్రామానికి చెందిన అడారి వంశీ (28) తన తల్లి అడారి కళావతి, కుటుంబ సభ్యులు తమ బంధువు కుమార్తె వివాహ వేడుకలకు మరి కొంతమం దితో కలిసి శుక్రవారం రాత్రి 3 ట్రాక్టర్లలో మండలంలోని డొంగు రువలస బయలు దేరారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ మర్రి విజయ్‌ అధిక వేగంతో ట్రాక్టర్‌ నడుపు తుండడంతో తొట్టిలో ప్రయాణిస్తున్న వంశి (28) ఎగిరిపడి రోడ్డుపై పడిపోయా డు. ఆయన తలకు బలమైన గాయం కావడంతో వెంటనే బంధు వులు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెంది నట్టు డాక్టర్‌ నిర్ధారించారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు బొబ్బిలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ నారాయణరావు ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ స్వామి కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 12 , 2026 | 12:12 AM