Share News

మునిసిపాలిటీలో పంచాయతీల విలీనంపై

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:08 PM

రాజాం మున్సిపాలిటీలో ఐదు గ్రామ పంచాయతీల విలీనంకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ జరిగిం ది.

   మునిసిపాలిటీలో పంచాయతీల విలీనంపై

హైకోర్టులో విచారణ

- 24కి వాయిదా

- నేడు కొత్తవలసలో గ్రామసభ

రాజాం రూరల్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాజాం మున్సిపాలిటీలో ఐదు గ్రామ పంచాయతీల విలీనంకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ జరిగిం ది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. దీన్ని ఈనెల 24కి న్యాయమూర్తి వాయిదా వేశారు. రెండు దశా బ్దాలుగా న్యాయస్థానంలో ఈ కేసు నలుగుతుంది. రా జాం, సారధి మేజర్‌ పంచాయతీలతో పాటు కొత్తవలస, కొండంపేట, పొనుగుటివలస పంచాయతీలను రాజాం నగర పంచాయతీలో విలీనం చేస్తున్నట్లు 2005లో ముని సిపల్‌ పరిపాలనాశాఖ ప్రకటించింది. తమ పదవీకాలం ఏడాది ఉండగా, తమ అనుమతి లేకుండా పంచాయ తీలను విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ కొత్తవలస, కొండంపేట, పొనుగుటివలస పంచాయతీల సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. రెండు దశాబ్దాలుగా కొనసా గుతున్న ఈ కేసు నుంచి ఇటీవల కొండంపేట, పొనుగు టివలస సర్పంచ్‌లు వైదొలిగారు. కొత్తవలస సర్పంచ్‌ శిమ్మ జగన్నాథంతో పాటు గ్రామస్థులు మాత్రం విలీన ప్రక్రియకు అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ సూచ నల మేరకు కొత్తవలస సర్పంచ్‌ సైతం వివాదం నుంచి వైదొలగాని నిర్ణయించుకున్నారు. దీంతో రాజాం మున్సి పల్‌ కమిషనర్‌ రామచంద్రరావు గత వారం అమరావతి లోని హైకోర్టుకు హాజరై ప్రభుత్వ న్యాయవాదిని సంప్ర దించారు. దీంతో మంగళవారం విచారణ జరిగింది.

నేడు గ్రామసభ

కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్తవ లసలో ఈనెల 9న సాయంత్రం 4 గంటలకు గ్రామసభ జరగనుంది. గ్రామాన్ని విలీనం చేయడాన్ని కొంతమంది గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గ్రా మసభ నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈమేరకు కమిషనర్‌ రామచంద్రరావు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Sep 08 , 2026 | 11:08 PM