కూతురి నిశ్చితార్థం రోజునే..
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:47 AM
కూతురు నిశ్చితార్థం రోజునే ఓ తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మృతి మిస్టరీగా మారింది.
విజయనగరం/ క్రైం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): కూతురు నిశ్చితార్థం రోజునే ఓ తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మృతి మిస్టరీగా మారింది. జిల్లా కేంద్రం లోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో గల తోటపాలెం రామ మందిరం సమీపంలో గొర్రిపిల్లి మోహనరావు(52) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు హారిక, పవిత్ర ఉన్నారు. పెద్ద కుమార్తె హారికకు వివాహం కాగా, బెంగుళూరులో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటోంది. హారికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ పద్మావ తి విజయనగంలోని సింగపూర్‌సిటీలోనే నివాసం ఉంటోంది. పవిత్ర కూడా ఉద్యోగం చేస్తూ వారితో పాటే ఉంటోంది. మోహనరావు ఒక్కరే తోటపాలెంలో నివాసం ఉంటున్నారు. ఈయన మద్యానికి బానిసయ్యారు. అయితే ఇటీవల పవిత్రకు వివాహం కుదిరింది. శుక్రవారమే నిశ్చితార్థం చేయాలని నిర్ణయించా రు. ఈక్రమంలో తోటపాలెంలో ఉంటున్న తండ్రి మోహనరావుకు పవిత్ర ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేదు. దీంతో వెంటనే తోటపాలెంలోని తండ్రి ఉంటు న్న ఇంటికి భార్య పద్మావతి, చిన్న కుమార్తె పవిత్ర చేరుకున్నారు. తలుపు లోప ల గడియపెట్టి ఉంది. దీంతో తలుపుకొట్టి పిలిచినా, స్పందన కనిపించలేదు. బం ధువుల సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, మోహనరావు రక్తమడుగులో పడి, మృతిచెంది ఉన్నారు. దీంతో పద్మావతి, పవిత్ర హతాసుల య్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ కమలా భార్గవ్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కమల భార్గవ్ తెలిపారు. అయితే మృతదేహంపై దుస్తులు లేకపోవడం, ఇంటిలోపల గోడలు, నేలపై రక్తపు మరకలు ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది.