గాయపడిన వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:50 PM
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
సాలూరు రూరల్, జనవరి18 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సాలూరు రూరల్ హెచ్‌సీ వి.బంగారురాజు వివరాల మేరకు.. కందులపథం గ్రామానికి చెందిన టేకు సన్యాసమ్మ(76) ఈనెల 13న గ్రామంలో రోడ్డు దాటుతుండగా అదే సమ యంలో కొట్టుపరువు కొత్తవలసకు చెందిన గణేష్ బైక్‌పై మామిడిపల్లి వెళ్తూ ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం తొలుత మామిడిపల్లి పీహెచ్‌సీ, ఆ తర్వాత సాలూరు ఏరియా ఆసుపత్రికి తర లించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం జిల్లా మహారాజ కేంద్రాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి మేనల్లుడు లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.