Share News

Gone Too Soon at Just Four! అయ్యో చిన్నా.. నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయా!

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:30 AM

Oh No, Little One… Gone Too Soon at Just Four! సీజన్‌ మార్పుతో తమ చిన్నారికి జ్వరం వచ్చిందనుకున్నారు. కానీ అదే తమ బిడ్డ ప్రాణం తీస్తుందని వారు తెలుసుకోలేకపోయారు. కురుకూటి పంచాయతీ పరిధి చినబారిగాం గ్రామానికి చెందిన చదన మానసమోహన్‌ (4) అనే గిరిజన బాలుడు సెరిబ్రల్‌ మలేరియాతో శుక్రవారం మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  Gone Too Soon at Just Four! అయ్యో చిన్నా.. నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయా!
మానసమోహన్‌ (ఫైల్‌)

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

సాలూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సీజన్‌ మార్పుతో తమ చిన్నారికి జ్వరం వచ్చిందనుకున్నారు. కానీ అదే తమ బిడ్డ ప్రాణం తీస్తుందని వారు తెలుసుకోలేకపోయారు. కురుకూటి పంచాయతీ పరిధి చినబారిగాం గ్రామానికి చెందిన చదన మానసమోహన్‌ (4) అనే గిరిజన బాలుడు సెరిబ్రల్‌ మలేరియాతో శుక్రవారం మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘అయ్యో చిన్నా.. నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయా?’ అంటూ రోది స్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చినబారిగాం గ్రామానికి చెందిన రామ్మూర్తి, రవణమ్మ దంపతులు వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా వారిలో రెండో కుమారుడు మానసమోహన్‌ గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో ఉదయం 10:30 గంటలకు తల్లిదండ్రులు బాలుడిని ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షలు చేయగా.. బాలుడికి సెరిబ్రల్‌ మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. అయితే 108 వాహనంపై ఆరికతోట దాటగానే బాలుడికి ఫిట్స్‌ అధికంగా రావడంతో తల్లిదండ్రులు మళ్లీ సాలూరు ఏరియా ఆసుపత్రికి వచ్చారు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యుడు సునీల్‌కుమార్‌ తెలిపారు. దీంతో తల్లిండ్రులు, బంధువులు భోరున విలపించారు.

Updated Date - Nov 14 , 2026 | 12:31 AM