Share News

Elephants! బాబోయ్‌.. ఏనుగులు

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:12 AM

"Oh No... Elephants!" సాలూరు మండలం నుంచి గజరాజులు కదలడం లేదు. గత రెండు రోజులు మావుడి పంచాయతీ పురుగానివలస గ్రామ పరిసరాలలో సంచరించిన ఏనుగులు ఆదివారం సోమడవలస, యరగడవలస, బూర్జి గ్రామాల సమీపంలోని తోటల్లో సంచరించాయి.

 Elephants! బాబోయ్‌.. ఏనుగులు
తోటల్లో సంచరిస్తున్న ఏనుగులు

  • ఆందోళనలో రైతులు

మక్కువ రూరల్‌(సాలూరు రూరల్‌)జూన్‌7(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం నుంచి గజరాజులు కదలడం లేదు. గత రెండు రోజులు మావుడి పంచాయతీ పురుగానివలస గ్రామ పరిసరాలలో సంచరించిన ఏనుగులు ఆదివారం సోమడవలస, యరగడవలస, బూర్జి గ్రామాల సమీపంలోని తోటల్లో సంచరించాయి. దీంతో ఆయా ప్రాంతవాసులు బెంబేలెత్తిపోయారు. ప్రధానంగా పంట లకు ఎటువంటి నష్టం వాటిల్లుతుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పటికే మావుడి పంచాయతీలోని పలు గ్రామాల పరిధిలో పామాయిల్‌, అరటితోటలను గజరాజులు ధ్వంసం చేశాయి. కాగా అటవీశాఖ సిబ్బంది ఏనుగల సంచారంపై నిఘాపెట్టారు. మరోవైపు ఆయా గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుం టున్నామని సాలూరు ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ తవిటినాయుడు తెలిపారు. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:12 AM