Share News

Oh my, the winds! అమ్మో గాలులు

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:30 AM

Oh my, the winds! మబ్బులు దిగితే చాలు జనం వణికిపోతున్నారు. వాన కంటే గాలులతోనే ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారు. ఏ చెట్టు కూలుతుందో.. ఏ స్తంభం పడుతుందోనని భయపడుతున్నారు. తాజాగా బుధవారం వీచిన ఈదురుగాలులకు చాలా మండలాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి.

Oh my, the winds! అమ్మో గాలులు
గజపతినగరం: వెలుగు కార్యాలయం ఎదురుగా ధ్వంసమైన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

అమ్మో గాలులు

నేలవాలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిపివేత

ఉద్యాన పంటలకు నష్టం

విజయనగరం, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): మబ్బులు దిగితే చాలు జనం వణికిపోతున్నారు. వాన కంటే గాలులతోనే ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారు. ఏ చెట్టు కూలుతుందో.. ఏ స్తంభం పడుతుందోనని భయపడుతున్నారు. తాజాగా బుధవారం వీచిన ఈదురుగాలులకు చాలా మండలాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి. ఉదయం 8 గంటల తర్వాత భానుడి భగభగలకు విలవిల్లాడారు. అంతలోనే మబ్బులు ఆపై గాలుల బీభత్సానికి అగచాట్లు పడ్డారు. చాలా చోట్ల చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. విజయనగరంలోని ఎన్‌సీఎస్‌ రోడ్డు, పాల్‌నగర్‌, కోట తదితర ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. పార్కుచేసి ఉన్న ద్విచక్రవాహనాలపై చెట్లు కూలటంతో నుజ్జు నుజ్జు అయ్యాయి. ఫ్లెక్సీలు ఎగిరిపడ్డాయి. గాలుల సమయంలో రోడ్డుపై వెళ్లేవారంతా భయంతో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. గజపతినగరంలో కారుపై విద్యుత్‌ స్తంభం కూలింది. దత్తిరాజేరు, మెంటాడ, గంట్యాడ, డెంకాడ, నెల్లిమర్ల తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది కాని భీకర గాలులకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. రామభద్రపురం, ఎస్‌.కోట, గంట్యాడ తదిత మండలాల్లో ఉద్యాన పంటలకు నష్టవాటిల్లింది.

Updated Date - Jun 11 , 2026 | 12:30 AM