అయ్యో రైతన్నా..
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:26 AM
ఆ రైతు ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట అది. తీర్థానికి వచ్చిన కొందరు వ్యక్తుల దుశ్చర్య వల్ల పంటంతా నష్టపోయాడు.
జామి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఆ రైతు ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట అది. తీర్థానికి వచ్చిన కొందరు వ్యక్తుల దుశ్చర్య వల్ల పంటంతా నష్టపోయాడు. మండలంలోని చింతాడ గ్రామంలో ఈ ఘటన శనివారం జరిగింది. దాసరి అప్పలనాయుడు అనే రైతు మూడున్నర ఎకరాల్లో పండించిన ధాన్యం కుప్పలు, గడ్డి ఒకచోట పోగు చేసుకున్నారు. మల్లేశ్వరస్వామి తీర్థానికి వచ్చిన కొందరు కల్లాల పక్కన మందుతాగిబ సిగరెట్లు కాల్చి ఆర్పకుండా అక్కడే పడేసి పోయారు. దీంతో ధాన్యం కుప్పలకు మంటలు వ్యాపించాయి. ఎస్.కోట ఆగ్నీమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే నష్టం జరిగిపోయింది. నాలుగైదు రోజులు పంట అమ్ముకునే వాడినని, ఇప్పుడు పెట్టుబడి కూడా నష్టపోయానని ఆ రైతు భోరున విలపించారు.