Share News

Oh my, ghat road! అమ్మో ఘాట్‌రోడ్డు

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:14 AM

Oh my, ghat road! సీతంపేట ఏజెన్సీలోని ఘాట్‌రోడ్లు నెత్తురోడుతున్నాయి. రోజుల వ్యవధిలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో మన్యంవాసులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. సవరగొయిది గ్రామ సమీపంలో ఉన్న ఘాట్‌రోడ్డులో ఇటీవల ఆటోబోల్తాపడి ఒక గిరిజనుడి మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. కాగా శు

 Oh my, ghat road! అమ్మో ఘాట్‌రోడ్డు
సవరగొయిది గ్రామ సమీపంలోని లోయలో బోల్తాపడిన ఆటో

  • లోయలో ఆటోబోల్తా....తొమ్మిది మందికి గాయాలు

  • శ్రీకాకుళం రిమ్స్‌కు ఒకరు రెఫర్‌

  • వరుస ఘటనలతో మన్యంవాసులు బెంబేలు

సీతంపేట, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని ఘాట్‌రోడ్లు నెత్తురోడుతున్నాయి. రోజుల వ్యవధిలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో మన్యంవాసులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. సవరగొయిది గ్రామ సమీపంలో ఉన్న ఘాట్‌రోడ్డులో ఇటీవల ఆటోబోల్తాపడి ఒక గిరిజనుడి మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. కాగా శుక్రవారం అదేరోడ్డుని లోయలో ఆటోబోల్తా పడిన ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని స్థానికులు 108వాహనంలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా జమ్మి, భామిని మండలం నేరడి గ్రామానికి చెందిన గ్రామస్థులు 14మంది శుక్రవారం ఆటోలో సీతంపేట మండలం కోడిశ గ్రామంలోని బంధువులు ఇంటికి వచ్చారు. అక్కడ మాటామంతీ , భోజనాలు చేసిన తర్వాత వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. కోడిశ నుండి శంభాం మీదుగా సవరగొయిది గ్రామానికి వస్తున్న ఘాట్‌రోడ్డు మార్గంలో మలుపు వద్ద ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ పసుపురెడ్డి మహేష్‌కు తీవ్రగాయలయ్యాయి. ఆయన్ని సీతంపేట ఏరియా ఆసుపత్రి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రెఫర్‌ చేశారు. ఇక గాయాలపాలైన వారిలో పి.లక్ష్మి, మీసాల పూర్ణ, నీలాపు పార్వతి, పి.రేవతిలకు సీతంపేట ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. బాధితుల్లో పి.నాయుడు, పాల్గున, శశిరేఖ, సునీత, నిరూష, సులోచన, అరుణ, తున్ని, శివ స్వల్ప గాయాలతో బయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వై.అమ్మన్నరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:14 AM