Share News

Who Will Stand By Us Now! దేవుడా.. ఇక మాకెవరు దిక్కు!

ABN , Publish Date - May 17 , 2026 | 11:43 PM

Oh God… Who Will Stand By Us Now! కొన్నాళ్ల కిందట తండ్రి చనిపోవడంతో ఆ యువకుడు ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు. ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే స్నేహితుడి తల్లి వర్ధంతి కోసమని రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. పనుల నిమిత్తం బైక్‌పై వెళ్లిన ఆ యువకుడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ కొన్న ఘటనలో ఆ యువకుడు మృత్యువాత పడ్డాడు.

 Who Will Stand By Us Now! దేవుడా.. ఇక మాకెవరు దిక్కు!
భాస్కరరావు (ఫైల్‌)

యువకుడి మృతి.. ముగ్గురికి గాయాలు

స్నేహితుడి తల్లి వర్ధంతికి వచ్చి.. తిరిగిరాని లోకాలకు..

కొడుకు దూరమవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు

గరుగుబిల్లి, మే17(ఆంధ్రజ్యోతి): కొన్నాళ్ల కిందట తండ్రి చనిపోవడంతో ఆ యువకుడు ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు. ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే స్నేహితుడి తల్లి వర్ధంతి కోసమని రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. పనుల నిమిత్తం బైక్‌పై వెళ్లిన ఆ యువకుడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ కొన్న ఘటనలో ఆ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయ పడ్డారు. ఈ విషాద ఘటన గరుగుబిల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పెద్దూరుకు చెందిన రాజాన భాస్కరరావు(24), భోగి తేజ స్నేహితులు. వారిద్దరూ విశాఖ పట్నంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఒక దగ్గరే ఉంటున్నారు. తేజ తల్లి వర్ధంతి కార్యక్రమం కోసం గత రెండు రోజుల కిందట వారు గ్రామానికి విచ్చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆదివారం బైక్‌పై ఆ యువకులు పార్వతీపురం వచ్చి స్వగ్రామానికి తిరుగు ప్రయాణ మయ్యారు. అయితే పార్వతీపురం వైపు నుంచి మరో బైక్‌ వస్తుండగా.. ఉల్లిభద్ర కూడలి వద్ద ఈ రెండు వాహనాలు ఢీ కొన్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహన సిబ్బంది క్షతగాత్రులను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజాన భాస్కరరావు మృతి చెందాడు. తేజతో పాటు పార్వతీపురం నుంచి బైక్‌పై వచ్చిన కొత్తవలసకు చెందిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న కుమారుడు భాస్కరరావు ఇక లేడని తెలిసి తల్లి ఆదిలక్ష్మి, సోదరి కన్నీరుమున్నీరయ్యారు. ఇక తమకు దిక్కెవరంటూ భోరున విలపించిన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. అందరితో కలివిడిగా ఉండే భాస్కరరావు మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 17 , 2026 | 11:43 PM