Scheme Implementation పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకం
ABN , Publish Date - Jul 24 , 2026 | 10:46 PM
Officials Play a Key Role in Scheme Implementation సంక్షేమ పథకాల అమలులో అధికారుల పాత్ర ఎంతో కీలకమని అమరావతి ప్లానింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ వి.వెంకటరావు అన్నారు. శుక్రవారం కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల అధికారులకు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగామ్ నిర్వహించారు.
కురుపాం, జూలై24(ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల అమలులో అధికారుల పాత్ర ఎంతో కీలకమని అమరావతి ప్లానింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ వి.వెంకటరావు అన్నారు. శుక్రవారం కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల అధికారులకు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగామ్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిఽథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా అందించేందుకు, శాఖల మధ్య సమన్వయం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. శిక్షణలో అందించే మార్గదర్శకాలు, ఉత్తమ విధానాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని సూచించారు. సందేహాలను నివృత్తి చేసుకుని విధుల్లో మరింత సమర్థత చూపాలన్నారు. ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.ధర్మరాజు మాట్లాడుతూ .. అధికారుల్లో నైపుణ్యాల పెంపు ఎంతో అవసరమన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.