Share News

కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన అధికారులు

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:33 AM

చామలాపల్లి పంచాయతీలో ఉన్న చెరువులు, బందలు, వాగు స్థలం, కొండ స్థలం ఆక్రమణపై ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన ‘ఆ ఊరంతా ఆ నలుగురు చేతిలోనే’ అనే కథనానికి కలెక్టర్‌ స్పందించారు.

కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన అధికారులు

  • చామలాపల్లిలో బందలు, చెరువుల పరిశీలన

ఎస్‌.కోట రూరల్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): చామలాపల్లి పంచాయతీలో ఉన్న చెరువులు, బందలు, వాగు స్థలం, కొండ స్థలం ఆక్రమణపై ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన ‘ఆ ఊరంతా ఆ నలుగురు చేతిలోనే’ అనే కథనానికి కలెక్టర్‌ స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ శ్రీనివాసరావును ఆదేశించారు. దీంతో శుక్రవారం తహసీల్దార్‌.. మండల సర్వేయర్‌ రామ, డీటీ రంజిత్‌తో కలిసి గ్రామంలోని బందలను పరిశీలించారు. గ్రామంలో ప్రస్తుతం రీసర్వే చేస్తున్నారని, ఇందులో భాగంగా చెరువులు, బందలు, వాగులు, గోస్తనీ తీరం వంటివి కూడా సర్వే చేస్తారని చెప్పారు. ఎటువంటి ఆక్రమణలు ఉన్నా తొలగిస్తామని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jan 24 , 2026 | 12:33 AM