officers are moving డొంక కదులుతోంది
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:50 PM
officers are moving ఓ ప్రైవేటు సంస్థ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి రెట్టింపు నగదు చెల్లిస్తామని నమ్మబలికి ఆపై ఉడాయించిన వైనంపై ‘నమ్మించి రూ.కోట్లు కొట్టేశారు’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పార్వతీపురం పరిసర ప్రాంతాలకు చెందిన బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న అక్కడి పోలీసులు మంగళవారం కొంతమంది బాఽధితులను పిలిచి ఏం జరిగిందని ఆరా తీశారు.
డొంక కదులుతోంది
ప్రైవేటు సంస్థ మోసాలపై పోలీసుశాఖలో కదలిక
పార్వతీపురంలో మొదలైన విచారణ
విశాఖసీపీని కలిసిన అక్కడి బాధితులు
పీఎం పాలెం స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సూచన
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ప్రకంపనలు
విజయనగరం క్రైం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):
ఓ ప్రైవేటు సంస్థ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి రెట్టింపు నగదు చెల్లిస్తామని నమ్మబలికి ఆపై ఉడాయించిన వైనంపై ‘నమ్మించి రూ.కోట్లు కొట్టేశారు’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పార్వతీపురం పరిసర ప్రాంతాలకు చెందిన బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న అక్కడి పోలీసులు మంగళవారం కొంతమంది బాఽధితులను పిలిచి ఏం జరిగిందని ఆరా తీశారు.
ఇప్పటి వరకూ కట్టినదెంత? ఏయే ఖాతాలకు జమ చేశారు? ఎన్నాళ్ళ నుంచి లావాదేవీలు నిలిచిపోయాయి. తరువాత ఎవరినైనా కలిశారా? వారు ఏమి సమాధానం చెప్పారు వంటి ప్రశ్నలు వేసి బాధితుల నుంచి వచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నట్టు తెలిసింది. మరో పక్క ఇంటిలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. జిల్లాలో బాధితులు ఎంత మంది ఉంటారు? ఎన్ని కోట్ల స్కాం జరిగింది? ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది? సూత్రాధారులు, పాత్రధారులు వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. మరోవైపు జిల్లాకు చెందిన విశాఖ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న పలువురు బాధితులు గత రెండు రోజులుగా అక్కడి పోలీసు కమిషనర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకోగా పోతుల మల్లయ్యపాలెం (పీఎం పాలెం) పోలీసులను సంప్రదించి అక్కడ ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు అక్కడకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్కాంలో కొందరు పోలీసులు ఉండడంతో వారు కూడా తమ పైఅధికారుల సూచనతో ఎస్పీ ఏఆర్ దామోదర్‌ని కలిసేందుకు చర్చించుకుంటున్నారు. ఓ ఎంపీ సోదరి కూడా బాధితురాలేనని వారి మాటల్లో ప్రస్తావనకు వచ్చింది. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో కథ మొత్తం నడిపించి నమ్మించి తమ పరిస్థితికి కారణమైన సంస్థ టీం లీడర్లపైనా ఫిర్యాదుకు బాధితులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని వారు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో పంచుకున్నారు.
- సూత్రధారులపై ఇప్పటికే ఫిర్యాదు చేసిన బాధితులు రేపో, మాపో పాత్రదారులైన టీం లీడర్స్‌పై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అంతా వీరి కనుసన్నలలోనే జరిగినందున వీరిపై చర్యలు మొదలైతే పెద్ద తలకాయల గుట్టు బయటపడుతుందని గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద కొన్నాళ్లుగా స్తబ్దుగా వున్న ఈ బాగోతం ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఒక్కసారిగా వెడేక్కింది. తాజా పరిణామాలు నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందని బాధితులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
========