Paidimaramma పైడిమారమ్మకు 101 రకాల వంటలతో సారె
ABN , Publish Date - May 04 , 2026 | 10:53 PM
Offering 101 Varieties of Dishes (Sare) to Paidimaramma కురుపాం గ్రామ దేవత పైడిమారమ్మకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని అమ్మవారికి గ్రామస్థులు 101 రకాల వంటకాలతో సారె సమర్పించారు.
కురుపాం, మే4(ఆంధ్రజ్యోతి): కురుపాం గ్రామ దేవత పైడిమారమ్మకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని అమ్మవారికి గ్రామస్థులు 101 రకాల వంటకాలతో సారె సమర్పించారు. తొలుత శివ్వాలవీధి, వంగరవీధి, నాయుడు వీధి వాసులు మేళతాళాలు, నృత్యాలతో 101 రకాల పిండి వంటలు, పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.