Odisha to Andhra Pradesh ఒడిశా టు ఆంధ్రా
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:48 PM
Odisha to Andhra Pradesh ఓ ప్రైవేట్ బస్సులో ఒడిశా నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న పోలీసులు
భామిని, మార్చి17(ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేట్ బస్సులో ఒడిశా నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు బత్తిలి చెక్‌పోస్టు వద్ద పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో ఒడిశా నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును కూడా విస్తృతంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా బస్సులో ఉన్న సుమారు 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులతో పాటు ప్రైవేట్ బస్సును కూడా బత్తిలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎస్‌ఐ జి.అప్పా రావును వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా గత ఏడాది నవంబరు నెలలో ఇదే చెక్‌పోస్టు వద్ద ఒడిశా నుంచి ఆంధ్రా వైపు వెళ్తున్న కారులో సుమారు క్వింటా గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.