ఆక్రమణల తొలగింపునకు ఆటంకం
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:19 AM
కాశిందొరవలస రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ శుక్రవారం ఉద్రిక్తత కు దారితీసింది.
బొబ్బిలి రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): కాశిందొరవలస రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ శుక్రవారం ఉద్రిక్తత కు దారితీసింది. విధుల్లో ఉన్న రెవెన్యూ అధికారు లను ఆక్రమణదారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంఽధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాశిందొరవలస రెవెన్యూ పరిధిలోని డొంగురువలసకు వెళ్లే రహదారి పక్కన సర్వే నెంబర్ 9లో సుమారు 3. 45 ఎకరాల ప్రభుత్వం గెడ్డ పోరంబోకు భూమిని కొంతమంది స్థానికులు ఆక్రమించి అందులో పంటలు వేశారు. దీనిపై అదే గ్రామానికి చెందిన కడుపుకోటి సత్యనారాయణ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆక్రమణదారులు అధికారుల ఆదేశాలను భేఖాతరు చేస్తూ తమ పనులను కొనసాగించారు. శుక్రవారం ఆర్‌ఐ రాంకుమార్, వీఆర్వో సుధాకర్ జేసీబీతో పంటను తొలగించేందుకు శుక్రవారం ప్రయత్నించారు. దాంతో ఆక్రమణదారులు అధికారులను అడ్డుకున్నారు. ఫ ఈ విషయంపై తహసీల్దార్ శ్రీనుని వివరణ కోరగా.. గెడ్డ పోరంబోకు రిజిస్ట్రేషన్ అవదన్నారు. వారు ఏవేవో డాక్యుమెంట్లు చూపి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తు న్నారన్నారు. గతంలో సంబంధిత భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామన్నారు. అయిన్పటికీ అదే ప్రాంతంలో మళ్లీ సాగు చేసి పంటలు పండించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పంటను ఎక్స్‌కవేటర్‌తో తొలగించడానికి వెళ్తే సూసైడ్ చేసుకుంటామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నా రన్నారు. రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఆక్రమణదారులపై కేసు వేస్తామన్నారు.