Share News

రెండోరోజూ ఆసుపత్రిలో పరిశీలన

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:22 AM

జిల్లా కేంద్ర ఆసుపత్రిని జాతీయ క్వాలిటీ ఇన్సూరెన్స్‌ బృందం మంగళ వారం రెండోరోజూ పరిశీలించింది.

రెండోరోజూ ఆసుపత్రిలో పరిశీలన
వైద్యులతో మాట్లాడుతున్న బృందం సభ్యులు

పార్వతీపురం, జూలై 28 (ఆంధ్ర జ్యోతి): జిల్లా కేంద్ర ఆసుపత్రిని జాతీయ క్వాలిటీ ఇన్సూరెన్స్‌ బృందం మంగళ వారం రెండోరోజూ పరిశీలించింది. రోగులకు కల్పిస్తున్న మౌలిక వసతులతో పాటు అందిస్తున్న వైద్యం రోగులు సహాయకులకు అందిస్తున్న సదుపాయాలు తదితర వాటిపై బృందం పరిశీలన చేపట్టింది. జాతీయ క్వాలిటీ ఎన్యూరెన్స్‌ బృందం సభ్యులు డాక్టర్‌ శ్రీమంత్‌కుమార్‌ పట్నాయక్‌ ఆనంద్‌కుమార్‌, డాక్టర్‌ నిర్మల బృందం ఆసుపత్రిలోని పీవీ యూనిట్‌, బ్లడ్‌ బ్యాంక్‌, నేత్ర తదితర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ బృందానికి.. డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నాగభూషణరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగశివజ్యోతి ఆసుపత్రి నుంచి అందుతున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంవో శ్యామల, డాక్టర్‌ శేషగిరిరావు, డాక్టర్‌ నాగశేఖర్‌, డాక్టర్‌ వెంకటేశ్‌, ఏపీ ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు వైద్య విభాగం ఉద్యోగులు సంఘం నాయకులు జీవీఆర్‌ఎస్‌ కిశోర్‌, జిల్లా క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు శ్రీనివాస్‌, డాక్టర్‌ రమణకుమార్‌ పట్నాయక్‌, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 12:22 AM