ఆక్వా రంగానికి అనేక రాయితీలు
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:34 AM
ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వమే అనేక రాయితీలు ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు.
మంత్రి శ్రీనివాస్
విజయనగరం, జూలై 15, (ఆంధ్రజ్యోతి): ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వమే అనేక రాయితీలు ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. బుధవారం విజయనగరం లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం భీమవరం పర్యటనలో ఆక్వారైతుల విషయమై ప్రభుత్వంపై జగన్ అసంబ ద్ధ విమర్శలు చేసి, తన రాజకీయ పరిణితిని కోల్పాయారన్నా రు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఫిష్ ఫీడ్, ఫిష్ ఆయిల్ ధరలు పెరగటం తో గత రెండు నెలలుగా వాటి ధరలు పెరిగాయన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆవేశపూరిత వాఖ్యలు చేయడం బాధ్యతాయుత రాజకీయ నాయకుడిగా జగన్‌కు తగ దని హితవుపలికారు. ఇటీవల మృతిచెందిన మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభు త్వం అన్ని విధాలుగా ఆదుకుందని మంత్రి తెలిపారు. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారాన్ని ఇచ్చిన విషయం జగన్‌కు తెలిసి.. ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.