Share News

Ballot Boxes బ్యాలెట్‌ బాక్సులకు నెంబరింగ్‌

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:11 AM

Numbering of Ballot Boxes జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. 15 మండలాల పరిధిలోని 226 ఎంపీటీసీ స్థానాలు, 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తున్నారు.

 Ballot Boxes బ్యాలెట్‌ బాక్సులకు నెంబరింగ్‌
గరుగుబిల్లి ఎంపీడీవో కార్యాలయంలో బ్యాలెట్‌ బాక్సులకు నెంబరింగ్‌ వేస్తున్న సిబ్బంది

గరుగుబిల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. 15 మండలాల పరిధిలోని 226 ఎంపీటీసీ స్థానాలు, 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు, మౌలిక వసతులు పరిశీలనతో పాటు పలు కార్యక్రమాలు పూర్తి చేశారు. ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా సరఫరా చేసేందుకు బ్యాలెట్‌ బాక్సులకు నెంబరింగ్‌ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.

Updated Date - Oct 26 , 2026 | 12:11 AM