Share News

Must Be Increased వేతనదారుల సంఖ్య పెంచాల్సిందే..

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:38 PM

Number of Salaried Employees Must Be Increased జిల్లాలో వేతనదారుల సంఖ్య పెంచి.. పూర్తిస్థాయిలో పనులు కల్పించాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు ఆదేశించారు. లేకుంటే సంబంధిత సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. బుధవారం రావుపల్లిలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు.

 Must Be Increased  వేతనదారుల సంఖ్య పెంచాల్సిందే..
రావుపల్లిలో మస్తర్లను పరిశీలిస్తున్న డ్వామా పీడీ

గరుగుబిల్లి, ఏప్రిల్‌1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేతనదారుల సంఖ్య పెంచి.. పూర్తిస్థాయిలో పనులు కల్పించాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు ఆదేశించారు. లేకుంటే సంబంధిత సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. బుధవారం రావుపల్లిలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ 15 మండలాల పరిధిలోని 450 పంచాయతీల్లో నూతనంగా ఉపాధి పనులు ప్రారంభమయ్యాయి. గతేడాది 1.75 లక్షల కుటుంబాలకు చెందిన 2.94 లక్షల మంది వేతనదారులు పనుల్లో పాల్గొన్నారు. ఈ ఏడాదిలో ప్రతి మండలంలో రోజుకు పదివేల మంది వేతనదారులకు పనులు కల్పించాలి. నిబంధనల మేరకు మస్తర్లు వేయకుంటే మేట్లును తొలగిస్తాం. ఎండల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి 11లోపు , సాయంత్రం 4 గంటల నుంచి పనులు చేపట్టాలి. ’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధి కౌన్సిల్‌ మెంబర్‌ ఎ.లావణ్యకుమార్‌, సర్పంచ్‌ బి.మహేష్‌, పార్వతీపురం ఏపీడీ పి.త్రివిక్రమరావు, ఏపీవో ఈశ్వరమ్మ, జేఈ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 11:38 PM