ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:20 AM
మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నేత నంద మూరి తారకరామారావు సేవలు చిరస్మరణీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్
నెల్లిమర్ల, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నేత నంద మూరి తారకరామారావు సేవలు చిరస్మరణీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పారసాం గ్రామం లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆదివా రం ఆవిష్కరించారు. అలాగే బుద్ధుడి విగ్రహాన్ని ఎమ్మె ల్యే లోకం నాగమాధవి, వివేకానంద విగ్రహాన్ని మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజులు ఆవిష్కరించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, విశాఖ నియోజకవర్గ నార్త్ పరిశీలకుడు సువ్వాడ రవి శేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద కుమార్, నగర పంచాయతీ అధ్యక్షుడు లెంక అప్పల నాయుడు, కొండవెలగాడ పీఏసీఎస్ చైర్మన్ డి.అజయ్ బాబు, డైరెక్టర్లు లోగిస శ్రీనివాస రావు, పతివాడ గోవిందరావు, మాజీ సర్పంచ్ గొలజాని నారాయణరావు, ఏఎంసీ ప్రతినిధి గేదెల రాజారావు, జనసేన పార్టీ నాయకులు కరుమజ్జి గోవిందరావు, పతివాడ శ్రీనివాస రావు పాల్గొన్నారు.