తెలుగుజాతికి గర్వకారణం ఎన్టీఆర్
ABN , Publish Date - May 28 , 2026 | 11:13 PM
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి వేడుకలను పార్వతీపురంలో గురువారం నిర్వహించారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, మే 28 (ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి వేడుకలను పార్వతీపురంలో గురువారం నిర్వహించారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డీఆర్‌వో హేమలత, ఇతర అధికారులు ఎన్టీఆర్ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి అనేక విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారన్నారు. తెలుగుజాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పారని కొనియాడారు.