Share News

NTR brought glory to the Telugu nation. తెలుగుజాతికి కీర్తి తెచ్చిన ఎన్టీఆర్‌

ABN , Publish Date - May 29 , 2026 | 12:01 AM

NTR brought glory to the Telugu nation. ప్రపంచ స్థాయిలో తెలుగుజాతికి ఎంతో కీర్తి, ప్రతిష్ఠలు తీసుకువచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్‌ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని స్థానిక స్టేట్‌బ్యాంక్‌ ఎదురుగా ఉన్న విగ్రహానికి గురువారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

NTR brought glory to the Telugu nation. తెలుగుజాతికి కీర్తి తెచ్చిన ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి కొండ పల్లి శ్రీనివాస్‌

తెలుగుజాతికి కీర్తి తెచ్చిన ఎన్టీఆర్‌

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గజపతినగరం, మే28(ఆంధ్రజ్యోతి): ప్రపంచ స్థాయిలో తెలుగుజాతికి ఎంతో కీర్తి, ప్రతిష్ఠలు తీసుకువచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్‌ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని స్థానిక స్టేట్‌బ్యాంక్‌ ఎదురుగా ఉన్న విగ్రహానికి గురువారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటారని, పేదలకు కూడు, గూడు, గుడ్డ దక్కాలన్న నినాదంతో రాజకీయ రంగప్రవేశం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే కిలో రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. సామాజిక భద్రత కింద పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్‌, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన అందించారన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాజకీయాల్లో రిజర్వేషన్‌ తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో అహర్నిశలూ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాష్టాభివృద్ధే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని నారా లోకేష్‌ పనిచేస్తున్నారని, రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకువస్తున్నారని అన్నారు.

--------------

Updated Date - May 29 , 2026 | 12:01 AM