Share News

Now, it’s time for battle.. ఇక సమరమే..

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:21 AM

Now, it’s time for battle.. రాజాం మునిసిపాల్టీలో అసలు సిసలు పోరాటానికి తెర లేచింది. మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి, వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఇద్దరు అభ్యర్థులు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినవారే. అయితే చైర్‌పర్సన్‌ పదవి జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ నుంచి బనిశెట్టి సౌజన్యలతను ఖరారు చేశారు.

Now, it’s time for battle.. ఇక సమరమే..

ఇక సమరమే..

జోరందుకోనున్న పుర ఎన్నికలు

జనసేన అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్యలత

సుదీర్ఘ నేపథ్యం కలిసివచ్చే అవకాశం

రాజాం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాజాం మునిసిపాల్టీలో అసలు సిసలు పోరాటానికి తెర లేచింది. మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి, వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఇద్దరు అభ్యర్థులు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినవారే. అయితే చైర్‌పర్సన్‌ పదవి జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ నుంచి బనిశెట్టి సౌజన్యలతను ఖరారు చేశారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా పాలవలస పద్మావతి ఖరారై ప్రచారపర్వంలో కూడా దిగారు. సౌజన్యలత దేవాంగ కులానికి చెందినవారు కాగా.. పద్మావతి తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన వారు. రాజాం పట్టణంలో రెండు సామాజికవర్గాలూ ఎక్కువే. ఆపై బీసీలు కూడా ఎక్కువగా ఉన్నారు. దీంతో పోరు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

నాటకీయ పరిణామాలు..

జనసేన అభ్యర్థి బనిశెట్టి సౌజన్యలత ఎంపిక వెనుక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె బలమైన నేపథ్యం నుంచి వచ్చారు. తాత బనిశెట్టి పార్వతీశం ఆప్కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడు. రాజాం మల్లిఖార్జున చేనేత సహకార సంఘానికి 25 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా సేవలందించారు. తండ్రి బనిశెట్టి వెంకటరమణ పట్టణానికి చెందిన టీడీపీ నేతగా ఉన్నారు. వీరిది వ్యాపార కుటుంబం. ఆపై చేనేత కార్మిక కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సౌజన్యలత ఎమ్మెస్సీ బీఈడీ పూర్తిచేశారు. బోధనా రంగంలో కూడా రాణించారు. భర్త షన్ముఖరావు ఎంబీఏ పట్టభద్రుడు. ఐటీ నిపుణుడు. జీఎంఆర్‌ గ్రూపు ఎయిర్‌పోర్టు సెక్టారులో జనరల్‌ మేనేజర్‌. సైబర్‌ సెక్యూరిటీ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే తాత, తండ్రి రాజకీయ నేపథ్యం ఒకవైపు..భర్త పనిచేసే జీఎంఆర్‌ సంస్థ మూలంగా ఆమెకు జనసేన టిక్కెట్‌ వచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జనసేనలో ఇప్పటివరకూ పనిచేస్తూ వచ్చిన వారిని కాకుండా.. టీడీపీ నేత కుమార్తెను జనసేనలోకి పంపించి టిక్కెట్‌ పొందారన్న టాక్‌ ఉంది. ఆపై స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ ఆశీస్సులు పుస్కలంగా ఉండడంతో ఇది సాధ్యమైందని తెలుస్తోంది.

ప్రచారంలో ముందు దిగినప్పటికీ..

వైసీపీ అభ్యర్థి పాలవలస పద్మావతిది కూడా రాజకీయ నేపథ్యమే. ఆమె భర్త పాలవలస శ్రీనివాసరావు వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె రెండేళ్లపాటు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరించారు. ఈమెకు మాజీ ఎంపీ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌తో బంధుత్వం ఉంది. అందుకే పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం కొనసాగుతూ వస్తున్నారు. అయితే అది నుంచి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం కలిసి వచ్చే అంశం. అదే స్థాయిలో పార్టీలో ఇతర నేతలను అణచివేస్తారన్న విమర్శ ఉంది. ఆపై పద్మావతి పెద్దగా చదువుకోలేదు. భర్త చాటు భార్య కావడం కూడా మైనస్‌గా పరిశీలకులు చెప్పుకుంటున్నారు. గట్టి పోటీ ఉంటుందని మాత్రం తెలుస్తోంది.

----------------------

Updated Date - Nov 17 , 2026 | 12:21 AM