Share News

Notification for panchayat polls today పంచాయతీ పోరుకు నేడే నోటిఫికేషన్‌

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:22 AM

Notification for panchayat polls today పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. స్థానిక సమరానికి సంబంధించి మునిసిపల్‌ ఎన్నికలకు ముందే షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. దాంట్లో స్వల్ప మార్పులు చేస్తూ శుక్రవారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

Notification for panchayat polls today పంచాయతీ పోరుకు   నేడే నోటిఫికేషన్‌

పంచాయతీ పోరుకు

నేడే నోటిఫికేషన్‌

773 పంచాయతీల్లో

7,292 వార్డులకు ఎన్నికలు

జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా పోలింగ్‌

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 12(ఆంఽద్రజ్యోతి):

పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. స్థానిక సమరానికి సంబంధించి మునిసిపల్‌ ఎన్నికలకు ముందే షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. దాంట్లో స్వల్ప మార్పులు చేస్తూ శుక్రవారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మూడు దశల్లో ఈ ఎన్నికల జరగనున్నాయి. 27 మండలాల పరిధిలో 773 గ్రామ పంచాయతీ లకు, 7,292 వార్డులకు 7368 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిల్లో 12,83,983 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. వారికి పంచాయతీలను కేటాయించారు.

పంచాయతీ ఎన్నిల నిర్వహణకు శుక్రవారం మొదటి విడత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అందులో వెల్లడించే షెడ్యూల్‌ ప్రకారం ప్రక్రియ పూర్తి చేస్తారు. రెండో విడతకు నవంబరు 16న , మూడు విడతకు నవంబరు 19న నోటిఫికేషన్‌ ఇస్తారు. కాగా మొదటి విడత పోలింగ్‌ ఈనెల 26న , రెండో విడత ఈనెల 29న, మూడో విడత డిసెంబరు 2వ తేదీన జరుగుతుంది. పోలింగ్‌ జరిగిన రోజే మధ్యాహ్నం 3 గంటల తర్వాత కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

మూడు విడతలుగా

మొదటి దశలో 256 పంచాయతీలు, 2416 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో బొబ్బిలి డివిజన్‌ పరిఽధిలోని బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం మండలాల్లో.. చీపురుపల్లి డివిజన్‌లో రేగిడి, వంగర మండలాల్లోనూ... విజయనగరం డివిజన్‌ పరిధిలోని కొత్తవలస, ఎల్‌.కోట, ఎస్‌.కోట, వేపాడ మండలాల్లో ఎన్నికలో జరగనున్నాయి.

రెండో దశలో 247 పంచాయతీలు 2338 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. బొబ్బిలి డివిజన్‌లోని దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ మండలాలకు,. చీపురుపల్లి డివిజన్‌లో చీపురుపల్లి , మెరకముడిదాం మండలాలకు, విజయనగరం డివిజన్‌లో భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లో ఎన్నికల జరగనున్నాయి.

మూడో దశలో 270 పంచాయతీలు, 2538 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. బొబ్బిలి డివిజన్‌లో తెర్లాం, చీపురుపల్లి డివిజన్‌లో గరివిడి, గుర్ల, రాజాం, సంతకవిటి మండలాల్లో, విజయనగరం డివిజన్‌లో బొండపల్లి, గంట్యాడ, జామి, విజయనగరం మండలాల్లో ఎన్నికల జరగనున్నాయి.

సమస్యాత్మక పంచాయతీలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో గుర్తించిన 181 సున్నిత, 111 అతి సున్నిత, 36 సమస్యాత్మక గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మూడు విడతలు కలిసి 8,866 బ్యాలెట్‌ బాక్సులు అవసరం. ఇందులో 20 శాతం అదనపు నిల్వ కూడా ఉండేలా చర్యలు తీసుకున్నారు. పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల సామగ్రి రవాణాకు అవసరమైన 121 వాహనాలు, 53 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వాహనాలు సమకూర్చనున్నారు. మూడు విడతల్లో కలిపి 222 నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.

-------------------------

Updated Date - Nov 13 , 2026 | 12:22 AM