Share News

Panchayat Secretaries కార్యదర్శులకు నోటీసులు

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:12 AM

Notices Issued to Panchayat Secretaries గరుగుబిల్లి మండల పరిధిలోని కొంకడివరం, ఉద్దవోలు పంచాయతీల కార్యదర్శులకు కలెక్టర్‌తో పాటు డీపీవో నోటీసులు జారీ చేశారు. కొంకడివరం పంచాయతీ కార్యదర్శి బి.వైకుంఠరావు కొమరాడ మండలంలో విధులు నిర్వహించిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చే సినట్లు ఆరోపణలున్నాయి. కాగా విచారణ సమయంలో సంబంధిత రికార్డులను అధికారులు పరిశీలించారు.

  Panchayat Secretaries కార్యదర్శులకు నోటీసులు

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండల పరిధిలోని కొంకడివరం, ఉద్దవోలు పంచాయతీల కార్యదర్శులకు కలెక్టర్‌తో పాటు డీపీవో నోటీసులు జారీ చేశారు. కొంకడివరం పంచాయతీ కార్యదర్శి బి.వైకుంఠరావు కొమరాడ మండలంలో విధులు నిర్వహించిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చే సినట్లు ఆరోపణలున్నాయి. కాగా విచారణ సమయంలో సంబంధిత రికార్డులను అధికారులు పరిశీలించారు. ఈ పరిశీలనలో సాధారణ నిధులు రూ. 2.57లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 12.65 లక్షను డ్రా చేసినట్లు తేలింది. అదేవిధంగా ఇంటి పన్నులకు సంబంధించి రిజిష్టర్లు నిర్వహించకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఆ మేరకు అందించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉద్దవోలు పంచాయతీ కార్యదర్శి జి.శ్రీనివాసరావు కొమరాడ మండలంలో నిధులు దుర్వి నియోగపర్చినట్లు ఆరోపణలు నెలకొన్నాయి. ఆయన సాధారణ నిధులు నుంచి రూ. 1.84 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 1.59 లక్షలను నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసినట్లు రుజవు అయింది. ఆరోపణలపై నాలుగు రోజుల్లో తగిన సమాచారం అందించాలని ఆదేశించినా వారి ద్దరూ స్పందించకపోవడంతో జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మరో దఫా నోటీ సులు జారీ చేశారు. సరైన వివరణ ఇవ్వకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా అధికారులు హెచ్చరించారు. కాగా ఈ అంశంపై సోమవారం ఎంపీడీవో జి.పైడితల్లి, డిప్యూటీ ఎంపీడీవో ఎల్‌.గోపాలరావును వివరణ కోరగా... ఇరువురు కార్యదర్శులకు సమాచారం అందించామన్నారు. నిర్ణీత సమయంలో స్పందించకుంటే తగు సమాచారాన్ని జిల్లా అధికారులకు నివేదిస్తామని తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 12:12 AM