Fertilizer Shops ఎరువుల దుకాణాలకు నోటీసులు
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:09 AM
Notices Issued to Fertilizer Shops జిల్లాలో సాలూరు, పార్వతీపురం మండలాల్లో మామిడిపల్లి, పుట్టూరు గ్రామాల్లో రెండు ఎరువుల దుకాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎరువుల విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు.
భామినిలో ఓ షాపు లైసెన్స్ రద్దు
పార్వతీపురం, జూన్28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాలూరు, పార్వతీపురం మండలాల్లో మామిడిపల్లి, పుట్టూరు గ్రామాల్లో రెండు ఎరువుల దుకాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎరువుల విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. స్టాక్ బోర్డు, రికార్డుల నిర్వహణ, ధరల బోర్డు లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నామని డీఏవో భవానీ శంకర్ ఆదివారం తెలిపారు. భామినిలో ఓ షాపు లైసెన్స్ రద్దు చేశామన్నారు. పాలకొండ మండలంలో ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎరువుల విక్రయాలు చేపడుతున్న వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశామని చెప్పారు. వీరఘట్టం మండలం కంబర రైతు సేవా కేంద్రంలో ఎరువులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిన సచివాలయ ఉద్యోగిని సస్పెండ్ చేశామని వెల్లడించారు.